నిర్ణయం తీసుకునే ముందే ఎందుకు అవగాహన పెంచుకోవాలి?

మనలో చాలా మందికి త్వరత్వరగా, అప్పటికప్పుడు ఏదనిపిస్తే దానివైపే మొగ్గి, తొందరపాటులో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం, తర్వాత సరైన నిర్ణయం తీసుకోలేదని పశ్చాత్తాపం చెందడం అలవాటే. నీవు తీసుకునే నిర్ణయాన్ని బట్టే నువ్వు రేపటి రోజున ఎక్కడ ఉంటావో నిర్ణయించబడుతుంది. కొంత ఆలస్యమైనా సరే దాని యొక్క ప్రాధాన్యతను బట్టి తగిన సమయం తీసుకుని ఆలోచించిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోవడం అన్ని విధాలా ఉత్తమం. ప్రతిసారీ అన్ని అనుకున్నట్లుగానే జరగాలనేం లేదు, కానీ ఎలాంటి అవగాహన లేకుండా చేసే పనులు తప్పు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

నిర్ణయం తీసుకునే క్రమంలో వివిధ దశలు..

1. విషయం పైన పరిజ్ఞానం పెంచుకోవడం

2. దాని ఫలితాన్ని ఊహించడం

3. సానుకూలతలు, ప్రతికూలతలు పరిశీలించడం

4. ఆలోచన ఫెయిల్ అయితే దాని ప్రభావాన్ని అంచనా వేసుకోవడం

5. చివరగా నష్ట ప్రభావం తక్కువగా ఉండి, సానుకూలతలు ఎక్కువగా వున్న దాన్ని ఎంచుకోవడం.


Comments

Popular posts from this blog

ఉన్నది ఒకటే జిందగి...

సమయాన్ని వృధా చేయకండి...