ఎందుకు ఓడిపోవాలి అంటే...?
పోటీ పడే ప్రతి ఒక్కరూ, పోరాడే ప్రతి వాడు, ప్రయత్నించే ఎవరైనా సరే గెలుపు కోసమే పోరాడతారు, గెలుపు కోసమే పోటీ పడతారు, గెలుపు కోసమే ప్రయత్నిస్తారు, గెలుపునే కాంక్షిస్తూ వుంటారు తప్ప ఎవరూ కూడా ఓడిపోవాలి అనుకోరు. కాని ఏ పోటీ లో నైనా గెలుపు, ఓటములు సహజమే అనే నిజాన్ని మాత్రం ఒప్పుకోక తప్పదు. గెలుపు ని ఎలాగైతే ఆస్వాదిస్తామో అలాగే ఓటమిని అంగీకరించడమే అసలైన విజేత లక్షణం. నువ్వెంతో కష్ట పడి సాధన చేయొచ్చు, నీ శాయశక్తులా ప్రయత్నించి ఉండొచ్చు అయినా కొన్ని సార్లు ఓటమి తప్పకపోవచ్చు. అలాంటప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావో అక్కడే తెలుస్తుంది నిజమైన విజేత లక్షణం.
విజేత అంటే ఎప్పుడూ గెలుస్తూనే వుంటాడు అనుకోవడం చాలా పొరపాటు. ఓటముల నుండి పాఠాలు నేర్చుకుంటూ, మళ్లీ అవే తప్పుల్ని చేయకుండా ముందుకెళ్లి, ఓటములకన్నా గెలుపుల సంఖ్యని పెంచుకునే వాడే విజేత.
Comments
Post a Comment