స్నేహంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు లేక భాగస్వామిలో కావచ్చు… ఎవరిలో అయినా సరే 100% కోసం ఎప్పుడూ వెతక్కండి. ఎప్పుడైతే ఎదుటివారు నూరు శాతం పక్కాగా ఉండాలనుకుంటామో అప్పుడే సమస్యలు మొదలవుతాయి. అది ఆ బంధాన్ని శాశ్వతంగా దూరం చేసుకోవడం వరకు కూడా వెళ్లొచ్చు. అందుకే ఎవరిలోనైనా సరే నూరు శాతం కోసం వెతకొద్దు, ఎందుకంటే మనుషులందరిలో కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. బలాల్ని గుర్తించి ప్రోత్సహించడం, బలహీనతలని దిద్దుకునేలా సహకరించడం చేయాలి. పొరపాట్లు చేస్తే క్షమించడం ప్రతీ బంధంలో వుండాల్సిన ముఖ్య లక్షణం. అలా చేయగలిగినప్పుడే ఏ బంధమైనా శాశ్వతంగా వుంటుంది. వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచంలో నూటికి నూరు శాతం పక్కాగా ఎవరూ వుండరు. మనుషులంతా అంతే, నేను ఎలా వున్నా సరే, ఎదుటివారు మాత్రం ఇలానే వుండాలి, అలానే ఉండాలి అనుకుంటాం. ఎవరికి వారు వాళ్ళు చేసేవి చాలా సరైనవిగా కనిపిస్తాయి కానీ ఎదుటివారు చేసేవి మాత్రం చిన్న పొరపాట్లని కూడా పెద్ద తప్పుగా భావించి నిందిస్తాం. తప్పులు చేయడం మానవ సహజం.ప్రతి ఒక్కరూ చిన్నవో, పెద్దవో తప్పులు చేస్తూనే వుంటారు. వాటి నుంచి నేర్చుకుంటూ మరోసారి చేయకుండా జగ్రత్తపడతారు. కొంతమంది చేసిన తప్పునే మళ్లీ...
Comments
Post a Comment