నువ్వు ఎలా జీవించాలని అనుకున్నా కూడా నీకు ఉన్నది ఒకే జీవితం. అందులో కొన్ని సార్లు నువ్వు సరైన నిర్ణయం తీసుకుని వుండొచ్చు, కొన్ని సార్లు తప్పుడు దారిలో లేదా నీకు అస్సలు ఇష్టం లేని దారిలో వెళ్తుండచ్చు అలాంటప్పుడు ఇదే జీవితం నువ్వు సరైన దారికి మల్లెందుకు అవకాశం ఇస్తుంది. అప్పుడైనా నువ్వు దాన్ని గుర్తించి నీకు నచ్చిన దారికి మళ్ళితే పరవాలేదు కానీ దాన్ని కూడా గుర్తించకుండా అలాగే వుంటే మాత్రం నీ ఆనందాన్ని నువ్వే దూరం చేసుకున్న వాడివవుతావు. మళ్లీ మళ్లీ జీవించే అవకాశం ఎవరికీ రాదు ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం. ఇందులోనే నీకు నచ్చినట్టు, ఆనందంగా జీవించు.
ఎంత ఖర్చు చేసినా నువ్వు ఎప్పటికీ కొనలేనిది సమయం. నీ దగ్గర ఉన్న సమయం కన్నా ఎక్కువ కొద్ది సెకన్ల సమయాన్ని కూడా నువ్వు కొనలేవు. అందుకే నీ దగ్గరున్న సమయాన్ని తెలివిగా ఖర్చు చేసుకో. ఒక రూపాయి వృధాగా ఖర్చు చేయడం తగ్గించావంటే రెండు రూపాయలు సంపాదించిన ట్లే, ఇదే సూత్రం సమయానికి కూడా వర్తిస్తుంది. ఒక క్షణాన్ని తెలివిగా వాడుకుంటే నువ్వు నీకున్న సమయాన్ని వృద్ధి చేసుకున్నట్లే అవుతుంది. అందుకే నీకు ఎలాంటి ఉపయోగం లేని, ఇతరులకు ఉపయోగ పడని ఏ పనులకైనా సరే నీ సమయాన్ని ఉపయోగించకు..
Comments
Post a Comment