Posts

Honorifics- Titles- Appelation

1. Master               - To address Boys below 16 years 2. Mister ( Mr. )    - To address Men of any age above 16 years (for both married and unmarried) 3. Messrs (M/S)    - To address more than one men (in businesses etc) 4. Mrs. (Misses)    - To address Married woman (Including widow/divorced) 5. Ms   (Mis)          - To address woman of any age not disclosing marital status (i.e, it can be used for both      married and unmarried equally) 6. Miss  (Miss)      - To address unmarried woman 7. Mx     (Mix )      - To address any one without disclosing the gender

మంచిని చాటింపు చేద్దాం

అవును మంచిని తప్పకుండ చాటింపు చెయ్యాలి.  ఈ మధ్యనే ఒక వీడియో లో ఒక కథ విన్నాను. అంతకు ముందు వరకు కూడా నాకు ఒక అభిప్రాయం ఉండేది. మంచి వాడు ఎప్పుడు కూడా నేను మంచివాణ్ణి అని చెప్పుకోడు అని. నిజమే మంచి వాడు అని చెప్పుకోకపోయిన పరవాలేదు కానీ కనీసం తాను చేసే మంచిగాని, తాను పాటించే మంచి గాని ఇతరులకు తెలియాలి. కచ్చితంగా తెలియాలి. అలా తెలియాలి అంటే కొన్ని సార్లు చెప్పుకోవాల్సి వస్తుంది.  ఇంతకీ ఆ వీడియో లో ఏం ఉందంటే చెడ్డవాడేమో దైర్యంగా తాను చెడు చేస్తున్నానని బహిరంగంగా చెప్పుకుంటున్నాడు, అంతే గాక అదేదో పెద్ద ఘనకార్యం లాగా అయిపొయింది. మంచివాడేమో తాను చేసేదేదో తప్పు అన్నట్లు గా వెనకే ఉండిపోతున్నాడు. మంచివాడు కదా ధైర్యంగా చెప్పుకోవాల్సింది అని గట్టిగా నొక్కి మరీచెప్పాడు. ఆలోచిస్తే అది అక్షరాలా నిజం అని అర్థమైంది. ప్రపంచంలో ఎంతో మంచి వుంది. ప్రపంచమంతా కూడా వెతకక్కరలేదు. మన చుట్టూ సమాజం లో కూడా ఎంతో మంచి జరుగుతుంది. ఆ మంచినే మనం నిత్యం చాటుదాం. అది మనం చూసేదైనా సరే లేక చేసేదైనా సరే. అలా జరిగినప్పుడే చుట్టూ ఉన్న మంచి కూడా అందరికీ తెలిసి, సమాజం చెడిపోయింది , అసలు మంచి అన్నదే లేదు అనుకునే వారి ఆ...

విడదీయరాని భార్యాభర్తల బంధం......

ఎన్ని బంధాలున్నప్పటికీ, భార్యాభర్తల బంధం విశేషమైనది, విశిష్టమైనది కూడాను. ఎందుకు విశేషమైనది, దానికి ఉన్న విశిష్టత ఏమిటో ఒక చిన్న కథ ద్వారా చెప్పుకుందాం. ఒక సైకాలజీ క్లాస్ లో ప్రొఫెసర్ ఆ రోజు కొత్తగా ఒక ఆట ఆడుదామన్నాడు. అందరు సరే అన్నారు. మొదలుపెట్టడానికి ఒకరిని రావాల్సిందిగా కోరాడు. తాను మొదలెడతానని రంజని లేచి నిలుచుంది. ఆట లో భాగంగా తనకిష్టమైన ఒక 40 వ్యక్తుల పేర్లు బోర్డుపై రాయమన్నారు. ప్రొఫెసర్ చెప్పినట్లుగానే రంజని తనకిష్టమైన 40 వ్యక్తుల పేర్లు బోర్డుపై రాసింది. తరువాత ప్రొఫెసర్, అక్కడున్న 40 పేర్లలోనుంచి ఒక 5 పేర్లు తుడిపేయమన్నాడు. కొంచెం ఆలోచించి తన కొలీగ్స్ పేర్లు ఒక ఐదింటిని తుడిచేసింది. తరువాత మరొక అయిదుగురి పేర్లు తుడిచేయమన్నాడు ప్రొఫెసర్. ఇంకాసేపు ఆలోచించి కొంచెం దూరపు బంధువుల పేర్లు తుడిచేసింది, అలా ప్రొఫెసర్ చెప్తున్నకొద్దీ మిగిలిన పేర్లు, స్నేహితుల పేర్లు తుడిచేస్తూ ఒక నాలుగు (అమ్మ, నాన్న, తన భర్త మరియు ఒక్కగానొక్క కొడుకు) పేర్లు మాత్రమే మిగిలాయి. అప్పటివరకు చూస్తున్న మిగతా విద్యార్థులంతా, ఇక ఇది ఏమాత్రం ఒక ఆట కాదు తమ తమ జీవితాల్లో జరుగుతున్న సంగతులలాగా అనుకుంటూ ఎంతో ఆలోచన...

ఒక్కొక్కటిగా...

మనలో చాలా మందికి ఏదైనా మొదలు పెట్టిన వెంటనే విజయం సాధించాలి,సక్సెస్ వచ్చేయాలి, నెంబర్ 1  కావాలి అనే ఆశ ఉంటుంది. విజయం పొందాలి అనుకోవడం మంచిదే కానీ వెంటనే జరిగిపోవాలి అనే ఆత్రుత ఏమాత్రం మంచిది కాదు. అది మంచిని చెయ్యక పోగా మొదటికే మోసం వస్తుంది.     అలా కాకుండా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళితే ఎంత పెద్ద లక్ష్యమైన సరే నెమ్మదిగా కరిగిపోయి, అనుకున్నది సాధించగలుగుతారు. లేదంటే వెంటనే సాధించేయాలని ఆరంభ శూరత్వంతో మొదలు పెడితే, ఆ క్షణం లో  బాగానే ఉన్నా కూడా కొంత కాలానికే మీరు చేయాల్సింది ఎంతో వున్నట్టుగా, ఇంకా ఎంతో దూరం వెళ్లాలనేలాగా, అందుకోవాల్సిన గమ్యం అందుకోలేనిదిగా కనిపిస్తుంది. నేను కూడా ఈ బ్లాగ్ మొదలు పెట్టగానే వెంటవెంటనే తెగ రాసెయ్యాలి, వీలైనన్ని పోస్టులు పెట్టేసి ఎదో చేసెయ్యాలి అని ఆతృతగా వరుసగా కొన్ని పోస్టు లు చేశాను. కానీ అలా ఆతృతగా వెంటనే ఏదోచేసేద్దామనే ఉత్సాహం వల్ల  తర్వాత కొన్ని రోజులకే ఇదేదో  కష్టమైన పనేమో అనిపించి ఆపెయ్యాల్సి వచ్చింది. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ రాయాలి అనిపించి ఓపెన్ చేసి చూస్తే కొన్ని పోస్టులున్నాయి. అవి కూడా బాగున్నాయి, అలాగే కంట...

ఉన్నది ఒకటే జిందగి...

నువ్వు ఎలా జీవించాలని అనుకున్నా కూడా నీకు ఉన్నది ఒకే జీవితం. అందులో కొన్ని సార్లు నువ్వు సరైన నిర్ణయం తీసుకుని వుండొచ్చు, కొన్ని సార్లు తప్పుడు దారిలో లేదా నీకు అస్సలు ఇష్టం లేని దారిలో వెళ్తుండచ్చు అలాంటప్పుడు ఇదే జీవితం నువ్వు సరైన దారికి మల్లెందుకు అవకాశం ఇస్తుంది. అప్పుడైనా నువ్వు దాన్ని గుర్తించి నీకు నచ్చిన దారికి మళ్ళితే పరవాలేదు కానీ దాన్ని కూడా గుర్తించకుండా అలాగే వుంటే మాత్రం నీ ఆనందాన్ని నువ్వే దూరం చేసుకున్న వాడివవుతావు. మళ్లీ మళ్లీ జీవించే అవకాశం ఎవరికీ రాదు ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం. ఇందులోనే నీకు నచ్చినట్టు, ఆనందంగా జీవించు.

సమయాన్ని వృధా చేయకండి...

ఎంత ఖర్చు చేసినా నువ్వు ఎప్పటికీ కొనలేనిది సమయం. నీ దగ్గర ఉన్న సమయం కన్నా ఎక్కువ కొద్ది సెకన్ల సమయాన్ని కూడా నువ్వు కొనలేవు. అందుకే నీ దగ్గరున్న సమయాన్ని తెలివిగా ఖర్చు చేసుకో. ఒక రూపాయి వృధాగా ఖర్చు చేయడం తగ్గించావంటే రెండు రూపాయలు సంపాదించిన ట్లే, ఇదే సూత్రం సమయానికి కూడా వర్తిస్తుంది. ఒక క్షణాన్ని తెలివిగా వాడుకుంటే నువ్వు నీకున్న సమయాన్ని వృద్ధి చేసుకున్నట్లే అవుతుంది. అందుకే నీకు ఎలాంటి ఉపయోగం లేని, ఇతరులకు ఉపయోగ పడని ఏ పనులకైనా సరే నీ సమయాన్ని ఉపయోగించకు..

ఒక్కో మెట్టు..

విజయం ఎవరికీ కూడా ఒక్కసారికే వచ్చి దరిచేరదు. ఒక్కో మెట్టు ఎక్కి రావాల్సిందే. చాలా మంది ఇక్కడే పొరపాటు చేస్తుంటారు, వాళ్ళు ఏ పనైనా మొదలు పెట్టిన మరు క్షణమే సక్సెస్ వాళ్ళ చేతికందాలని కలలు కంటుంటారు, అందుకే అలాంటి కలలు అక్కడే మిగిలిపోతాయి. అవి నిజరూపం దాల్చక ముందే అత్యాశతో వాళ్ళ కలల్ని వాళ్ళే చంపేసుకుంటారు. ఎప్పుడైతే నీ కల కోసం ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెలతావో అప్పుడు నీ కల కూడా నీలాగే ఒక్కో అడుగు ముందుకేసి నిన్ను చేరాలని చూస్తుంది. ఆ విషయం తెలుసుకుని నీ పయనం మొదలు పెట్టు, ఒక్కో మెట్టు ఎక్కి నీ విజయాన్ని చేరుకో, అంతే గాని ఒకే సారి నీ చేతికందట్లేదని నీ కలనే మాయం చేసుకోక ముందుకు సాగిపో...