విడదీయరాని భార్యాభర్తల బంధం......
ఎన్ని బంధాలున్నప్పటికీ, భార్యాభర్తల బంధం విశేషమైనది, విశిష్టమైనది కూడాను. ఎందుకు విశేషమైనది, దానికి ఉన్న విశిష్టత ఏమిటో ఒక చిన్న కథ ద్వారా చెప్పుకుందాం.
ఒక సైకాలజీ క్లాస్ లో ప్రొఫెసర్ ఆ రోజు కొత్తగా ఒక ఆట ఆడుదామన్నాడు. అందరు సరే అన్నారు. మొదలుపెట్టడానికి ఒకరిని రావాల్సిందిగా కోరాడు. తాను మొదలెడతానని రంజని లేచి నిలుచుంది. ఆట లో భాగంగా తనకిష్టమైన ఒక 40 వ్యక్తుల పేర్లు బోర్డుపై రాయమన్నారు. ప్రొఫెసర్ చెప్పినట్లుగానే రంజని తనకిష్టమైన 40 వ్యక్తుల పేర్లు బోర్డుపై రాసింది. తరువాత ప్రొఫెసర్, అక్కడున్న 40 పేర్లలోనుంచి ఒక 5 పేర్లు తుడిపేయమన్నాడు. కొంచెం ఆలోచించి తన కొలీగ్స్ పేర్లు ఒక ఐదింటిని తుడిచేసింది. తరువాత మరొక అయిదుగురి పేర్లు తుడిచేయమన్నాడు ప్రొఫెసర్. ఇంకాసేపు ఆలోచించి కొంచెం దూరపు బంధువుల పేర్లు తుడిచేసింది, అలా ప్రొఫెసర్ చెప్తున్నకొద్దీ మిగిలిన పేర్లు, స్నేహితుల పేర్లు తుడిచేస్తూ ఒక నాలుగు (అమ్మ, నాన్న, తన భర్త మరియు ఒక్కగానొక్క కొడుకు) పేర్లు మాత్రమే మిగిలాయి. అప్పటివరకు చూస్తున్న మిగతా విద్యార్థులంతా, ఇక ఇది ఏమాత్రం ఒక ఆట కాదు తమ తమ జీవితాల్లో జరుగుతున్న సంగతులలాగా అనుకుంటూ ఎంతో ఆలోచనతో చూడసాగారు. అప్పుడు ప్రొఫెసర్, ఆ మిగిలిన నాలుగు పేర్లలోనుంచి 3 పేర్లను తుడిచేయమన్నాడు. అందరు ఆసక్తిగా ఏ పేర్లు తుడిచేస్తారా అని ఎదురుచూడసాగారు. రంజని కొద్దిగా ఆలోచించి తన అమ్మ, నాన్న మరియు కొడుకు పేర్లు తుడిచేసింది.
ప్రొఫెసర్ వెంటనే, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నీవు స్వయంగా మోసిన నీ కొడుకు లను కాదని నీ భర్త పేరే ఉంచడానికి కారణం ఏంటి అని అడిగాడు. సమాధానంగా రంజని, సర్.. ఎవరైనా సరే ఒక వయసొచ్చాక(పెళ్లి, ఉద్యోగం, చదువులు మొదలైన ఏ కారణంగా నైనా సరే ) తల్లి దండ్రులకి దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాగే తాను ఎంతగా ప్రేమించే తన బిడ్డలయిన సరే ఒకానొక వయసొచ్చాక వాళ్ళకు దూరంగా బ్రతకాల్సి రావొచ్చు. అలా ఎవరు దూరమైనా, ఎంతమంది దూరం కావాల్సి వచ్చినా కానీ, ఒక భర్త, భార్య మాత్రమే తాము ఒక్కటైన సమయంనుంచి చనిపోయే వరకు కూడా కలిసే ఉంటారు. అందుకే నా భర్త పేరునే చివరి వరకు తుడిచేయకుండా వున్నాను అని సమాధానమిస్తుంది.
అప్పుడు ప్రొఫెసర్ దీన్ని ఉదాహరణగా చెప్తూ, అందుకే ఏవో చిన్న చిన్న విషయాలకి గొడవపడి, ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా, ప్రేమ ని నటిస్తూ ఉండకుండా ఎన్ని అడ్డంకులు వచ్చిన సరే, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరికి ఒకరు తోడుంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కాని అభాసుపాలు చేసుకోకూడదు అని అందరికి అర్ధమయ్యే రీతిలో వివరిస్తాడు.
జననం నుండి, మరణం వరకు నీతో ఎంతో మంది ప్రయాణం చేసిన కూడా వాళ్ళు ఎక్కడో కలిసి ఎక్కడో విడిపోయే వారే ఉండొచ్చు. అలా అందరు నిన్ను వదిలేసినా కూడా నిత్యం , నిరంతరం నీతో ఉండేది నీ భాగస్వామే . కాబట్టి ఈ చిన్న జీవితాన్ని సంతోషమయం చేసుకోవడం అనేది నీ భాగస్వామిని ఎలా చూసుకుంటున్నావనే దానిపై ఆధారపడి ఉంటుంది. తనని ఇష్టంగా ప్రేమించు అదే ప్రేమ నీకు తిరిగి వస్తుంది. నీ అమ్మలా, సోదరిలా…..
Comments
Post a Comment