Posts

Showing posts from June, 2020

మంచిని చాటింపు చేద్దాం

అవును మంచిని తప్పకుండ చాటింపు చెయ్యాలి.  ఈ మధ్యనే ఒక వీడియో లో ఒక కథ విన్నాను. అంతకు ముందు వరకు కూడా నాకు ఒక అభిప్రాయం ఉండేది. మంచి వాడు ఎప్పుడు కూడా నేను మంచివాణ్ణి అని చెప్పుకోడు అని. నిజమే మంచి వాడు అని చెప్పుకోకపోయిన పరవాలేదు కానీ కనీసం తాను చేసే మంచిగాని, తాను పాటించే మంచి గాని ఇతరులకు తెలియాలి. కచ్చితంగా తెలియాలి. అలా తెలియాలి అంటే కొన్ని సార్లు చెప్పుకోవాల్సి వస్తుంది.  ఇంతకీ ఆ వీడియో లో ఏం ఉందంటే చెడ్డవాడేమో దైర్యంగా తాను చెడు చేస్తున్నానని బహిరంగంగా చెప్పుకుంటున్నాడు, అంతే గాక అదేదో పెద్ద ఘనకార్యం లాగా అయిపొయింది. మంచివాడేమో తాను చేసేదేదో తప్పు అన్నట్లు గా వెనకే ఉండిపోతున్నాడు. మంచివాడు కదా ధైర్యంగా చెప్పుకోవాల్సింది అని గట్టిగా నొక్కి మరీచెప్పాడు. ఆలోచిస్తే అది అక్షరాలా నిజం అని అర్థమైంది. ప్రపంచంలో ఎంతో మంచి వుంది. ప్రపంచమంతా కూడా వెతకక్కరలేదు. మన చుట్టూ సమాజం లో కూడా ఎంతో మంచి జరుగుతుంది. ఆ మంచినే మనం నిత్యం చాటుదాం. అది మనం చూసేదైనా సరే లేక చేసేదైనా సరే. అలా జరిగినప్పుడే చుట్టూ ఉన్న మంచి కూడా అందరికీ తెలిసి, సమాజం చెడిపోయింది , అసలు మంచి అన్నదే లేదు అనుకునే వారి ఆ...

విడదీయరాని భార్యాభర్తల బంధం......

ఎన్ని బంధాలున్నప్పటికీ, భార్యాభర్తల బంధం విశేషమైనది, విశిష్టమైనది కూడాను. ఎందుకు విశేషమైనది, దానికి ఉన్న విశిష్టత ఏమిటో ఒక చిన్న కథ ద్వారా చెప్పుకుందాం. ఒక సైకాలజీ క్లాస్ లో ప్రొఫెసర్ ఆ రోజు కొత్తగా ఒక ఆట ఆడుదామన్నాడు. అందరు సరే అన్నారు. మొదలుపెట్టడానికి ఒకరిని రావాల్సిందిగా కోరాడు. తాను మొదలెడతానని రంజని లేచి నిలుచుంది. ఆట లో భాగంగా తనకిష్టమైన ఒక 40 వ్యక్తుల పేర్లు బోర్డుపై రాయమన్నారు. ప్రొఫెసర్ చెప్పినట్లుగానే రంజని తనకిష్టమైన 40 వ్యక్తుల పేర్లు బోర్డుపై రాసింది. తరువాత ప్రొఫెసర్, అక్కడున్న 40 పేర్లలోనుంచి ఒక 5 పేర్లు తుడిపేయమన్నాడు. కొంచెం ఆలోచించి తన కొలీగ్స్ పేర్లు ఒక ఐదింటిని తుడిచేసింది. తరువాత మరొక అయిదుగురి పేర్లు తుడిచేయమన్నాడు ప్రొఫెసర్. ఇంకాసేపు ఆలోచించి కొంచెం దూరపు బంధువుల పేర్లు తుడిచేసింది, అలా ప్రొఫెసర్ చెప్తున్నకొద్దీ మిగిలిన పేర్లు, స్నేహితుల పేర్లు తుడిచేస్తూ ఒక నాలుగు (అమ్మ, నాన్న, తన భర్త మరియు ఒక్కగానొక్క కొడుకు) పేర్లు మాత్రమే మిగిలాయి. అప్పటివరకు చూస్తున్న మిగతా విద్యార్థులంతా, ఇక ఇది ఏమాత్రం ఒక ఆట కాదు తమ తమ జీవితాల్లో జరుగుతున్న సంగతులలాగా అనుకుంటూ ఎంతో ఆలోచన...

ఒక్కొక్కటిగా...

మనలో చాలా మందికి ఏదైనా మొదలు పెట్టిన వెంటనే విజయం సాధించాలి,సక్సెస్ వచ్చేయాలి, నెంబర్ 1  కావాలి అనే ఆశ ఉంటుంది. విజయం పొందాలి అనుకోవడం మంచిదే కానీ వెంటనే జరిగిపోవాలి అనే ఆత్రుత ఏమాత్రం మంచిది కాదు. అది మంచిని చెయ్యక పోగా మొదటికే మోసం వస్తుంది.     అలా కాకుండా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళితే ఎంత పెద్ద లక్ష్యమైన సరే నెమ్మదిగా కరిగిపోయి, అనుకున్నది సాధించగలుగుతారు. లేదంటే వెంటనే సాధించేయాలని ఆరంభ శూరత్వంతో మొదలు పెడితే, ఆ క్షణం లో  బాగానే ఉన్నా కూడా కొంత కాలానికే మీరు చేయాల్సింది ఎంతో వున్నట్టుగా, ఇంకా ఎంతో దూరం వెళ్లాలనేలాగా, అందుకోవాల్సిన గమ్యం అందుకోలేనిదిగా కనిపిస్తుంది. నేను కూడా ఈ బ్లాగ్ మొదలు పెట్టగానే వెంటవెంటనే తెగ రాసెయ్యాలి, వీలైనన్ని పోస్టులు పెట్టేసి ఎదో చేసెయ్యాలి అని ఆతృతగా వరుసగా కొన్ని పోస్టు లు చేశాను. కానీ అలా ఆతృతగా వెంటనే ఏదోచేసేద్దామనే ఉత్సాహం వల్ల  తర్వాత కొన్ని రోజులకే ఇదేదో  కష్టమైన పనేమో అనిపించి ఆపెయ్యాల్సి వచ్చింది. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ రాయాలి అనిపించి ఓపెన్ చేసి చూస్తే కొన్ని పోస్టులున్నాయి. అవి కూడా బాగున్నాయి, అలాగే కంట...

ఉన్నది ఒకటే జిందగి...

నువ్వు ఎలా జీవించాలని అనుకున్నా కూడా నీకు ఉన్నది ఒకే జీవితం. అందులో కొన్ని సార్లు నువ్వు సరైన నిర్ణయం తీసుకుని వుండొచ్చు, కొన్ని సార్లు తప్పుడు దారిలో లేదా నీకు అస్సలు ఇష్టం లేని దారిలో వెళ్తుండచ్చు అలాంటప్పుడు ఇదే జీవితం నువ్వు సరైన దారికి మల్లెందుకు అవకాశం ఇస్తుంది. అప్పుడైనా నువ్వు దాన్ని గుర్తించి నీకు నచ్చిన దారికి మళ్ళితే పరవాలేదు కానీ దాన్ని కూడా గుర్తించకుండా అలాగే వుంటే మాత్రం నీ ఆనందాన్ని నువ్వే దూరం చేసుకున్న వాడివవుతావు. మళ్లీ మళ్లీ జీవించే అవకాశం ఎవరికీ రాదు ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం. ఇందులోనే నీకు నచ్చినట్టు, ఆనందంగా జీవించు.

సమయాన్ని వృధా చేయకండి...

ఎంత ఖర్చు చేసినా నువ్వు ఎప్పటికీ కొనలేనిది సమయం. నీ దగ్గర ఉన్న సమయం కన్నా ఎక్కువ కొద్ది సెకన్ల సమయాన్ని కూడా నువ్వు కొనలేవు. అందుకే నీ దగ్గరున్న సమయాన్ని తెలివిగా ఖర్చు చేసుకో. ఒక రూపాయి వృధాగా ఖర్చు చేయడం తగ్గించావంటే రెండు రూపాయలు సంపాదించిన ట్లే, ఇదే సూత్రం సమయానికి కూడా వర్తిస్తుంది. ఒక క్షణాన్ని తెలివిగా వాడుకుంటే నువ్వు నీకున్న సమయాన్ని వృద్ధి చేసుకున్నట్లే అవుతుంది. అందుకే నీకు ఎలాంటి ఉపయోగం లేని, ఇతరులకు ఉపయోగ పడని ఏ పనులకైనా సరే నీ సమయాన్ని ఉపయోగించకు..

ఒక్కో మెట్టు..

విజయం ఎవరికీ కూడా ఒక్కసారికే వచ్చి దరిచేరదు. ఒక్కో మెట్టు ఎక్కి రావాల్సిందే. చాలా మంది ఇక్కడే పొరపాటు చేస్తుంటారు, వాళ్ళు ఏ పనైనా మొదలు పెట్టిన మరు క్షణమే సక్సెస్ వాళ్ళ చేతికందాలని కలలు కంటుంటారు, అందుకే అలాంటి కలలు అక్కడే మిగిలిపోతాయి. అవి నిజరూపం దాల్చక ముందే అత్యాశతో వాళ్ళ కలల్ని వాళ్ళే చంపేసుకుంటారు. ఎప్పుడైతే నీ కల కోసం ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెలతావో అప్పుడు నీ కల కూడా నీలాగే ఒక్కో అడుగు ముందుకేసి నిన్ను చేరాలని చూస్తుంది. ఆ విషయం తెలుసుకుని నీ పయనం మొదలు పెట్టు, ఒక్కో మెట్టు ఎక్కి నీ విజయాన్ని చేరుకో, అంతే గాని ఒకే సారి నీ చేతికందట్లేదని నీ కలనే మాయం చేసుకోక ముందుకు సాగిపో...

ఎంత పెద్ద విజయమైనా చిన్న అడుగు తోనే మొదలవుతుంది

మనలో చాలా మంది చేసే తప్పు పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకుని వాటిని చేరుకుంటామో లేదోనని భయంతో తీరా మొదలెట్టకుండానే ఆ లక్ష్యాన్నే వదిలేస్తుంటారు. లక్ష్యం ఎంత పెద్దదైనా సరే మొదలయ్యేది ఒక్క అడుగుతోనే అనే విషయం తెలుసుకుని ముందు నీ పనిని మొదలు పెట్టి చూడు, నెమ్మదిగా నీ లక్ష్యం చిన్నదై నీ దరికి చేరుతుంది. మొదలు పెడితే సగం పని అయినట్లే అని అందుకే అన్నారు.

ఎందుకు ఓడిపోవాలి అంటే...?

పోటీ పడే ప్రతి ఒక్కరూ, పోరాడే ప్రతి వాడు, ప్రయత్నించే ఎవరైనా సరే గెలుపు కోసమే పోరాడతారు, గెలుపు కోసమే పోటీ పడతారు, గెలుపు కోసమే ప్రయత్నిస్తారు, గెలుపునే కాంక్షిస్తూ వుంటారు తప్ప ఎవరూ కూడా ఓడిపోవాలి అనుకోరు. కాని ఏ పోటీ లో నైనా గెలుపు, ఓటములు సహజమే అనే నిజాన్ని మాత్రం ఒప్పుకోక తప్పదు. గెలుపు ని ఎలాగైతే ఆస్వాదిస్తామో అలాగే ఓటమిని అంగీకరించడమే అసలైన విజేత లక్షణం. నువ్వెంతో కష్ట పడి సాధన చేయొచ్చు, నీ శాయశక్తులా ప్రయత్నించి ఉండొచ్చు అయినా కొన్ని సార్లు ఓటమి తప్పకపోవచ్చు. అలాంటప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావో అక్కడే తెలుస్తుంది నిజమైన విజేత లక్షణం. విజేత అంటే ఎప్పుడూ గెలుస్తూనే వుంటాడు అనుకోవడం చాలా పొరపాటు. ఓటముల నుండి పాఠాలు నేర్చుకుంటూ, మళ్లీ అవే తప్పుల్ని చేయకుండా ముందుకెళ్లి, ఓటములకన్నా గెలుపుల సంఖ్యని పెంచుకునే వాడే విజేత.

కాంపిటీటివ్ సక్సెస్ మంత్ర...

1. సిలబస్ పూర్తిగా చదవడం 2. సరైన పుస్తకాల సేకరణ 3. ప్రీవియస్ పరీక్షల పేపర్ ల సాధన 4. సిలబస్ లో వున్న ప్రతీ విషయాన్ని బుక్స్ లో చదవడం 5. నమూనా పరీక్షలు రాస్తూ వుండడం 6. నోట్స్ తయారు చేసుకోవడం 7. రివిజన్ చేయడం, మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయడం 8.పైన చెప్పిన నియమాల్లో ఒక్కటి కూడా మిస్ చేయకపోవడం

అంతా మనమంచికే....(తప్పక చదివి తీరాల్సిన ఒక మంచి కథ)

సుఖదుఃఖాలు, సంతోషం బాధ అనేవి జీవితంలో ఒక భాగం మాత్రమే అంతే కాని చిన్న కష్టం రాగానే దాన్నే పట్టుకుని బాధ పడుతూ కూర్చుంటే నువ్వు చేయవలసిన పనులు అలాగే మిగిలిపోతాయి. అది మంచి చేయకపోగా నిన్ను వెనక్కి లాగుతూ వుంటాయి. అందుకే ఏది జరిగినా కూడా మంచికే జరిగిందనుకొని ముందుకెళ్లడం వుత్తమం అని చెప్పే ఒక కథ చెప్పుకుందాం. అనగనగా ఒక రాజు వుండే వాడు, ఆ రాజు దగ్గర చాలా తెలివైన ఒక మంత్రి వుండేవాడు. అయితే తన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే ఎవరు తమ సమస్యల్ని చెప్పుకోవడానికి వచ్చినా కూడా అయిందేదో అయింది అదంతా మంచికే జరిగింది అనుకుని ముందుకు సాగాలి అని చెప్తూ వుండే వాడు, కొంతమంది మంత్రి మాటలు సహజంగానే తీసుకున్నప్పటికీ చాలా మందికి అది నచ్చేది కాదు. అలాగే ఒకరోజు రాజ్యం లోని ఒక వ్యక్తి భార్య చనిపోయిందని మంత్రికి చెప్తూ బాధపడుతుంటే, మంత్రి దీనికి కూడా అయిందేదో నీ మంచికే అయింది బాధపడకుండా, నీ పనుల్లో నిమగ్నమై పోయి ముందుకు సాగాలి అని చెప్తుపొతున్నాడు, అది సహించలేని ఆ వ్యక్తి మంత్రిపై కోపంతో తిరిగి వెళ్ళిపోతాడు. అది చూసిన రాజు గారికి కూడా మంత్రిపై కోపం కలుగుతుంది. కొన్నాళ్ళు పోయాక మంత్రి గారి భార్య కూడా చనిపోయింది అప్పుడు క...

మీ జీవితం మీ ఆలోచనల ప్రతిబింబమే...

నీ ఆలోచనల్ని మార్చుకున్నట్లైతే... నీ జీవివితాన్ని మార్చుకున్నట్లే... ఒక ఆలోచనే ఒక కొత్త విషయానికి మూలం అవ్వచ్చు. ఒక ఆలోచనే ఒక కొత్త ఆవిష్కణకు నాంది కావచ్చు.

విభజించు… సాధించు…

గమ్యం పెద్దగా కనిపించినప్పుడు వదిలేయడం కాదు చేయాల్సింది. చిన్నదిగా విభజించుకోవడం. అవును కొన్ని సార్లు నీ గమ్యాన్ని చూసి నీకే భయం వేయొచ్చు. వంద మైళ్ళు పరుగెత్తాలి అని వినగానే నీ గుండె అక్కడే ఆగిపోవచ్చు, కాని దాన్ని ఒక్కొక్క మైలు వంద సార్లు పరుగెత్తాలి అని విభజించుకో, అప్పుడు నీ ముందు ఒకే మైలు, నీవు పరుగెత్తాల్సింది ఒకే మైలు. అలా ఒక వంద సార్లు పరుగెడితే సరిపోతుంది. అలాగే ఒక 15 పుస్తకాలు చదవాలి అని వినగానే నీ వల్ల కాదు అనిపించి పక్కన పడేయొచ్చు. కాని ఒకే పుస్తకం చదువు. ఒక్కటి చదవడం కష్టంగా అనిపించదు. అది అయ్యాక ఇంకొకటి, దాని తర్వాత మరొకటి. చాలా సులభం. ఇంత మాత్రానికే ప్రతి దాన్ని పెద్దగా ఊహించుకుని, భయపడి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోకు. మొన్ననే ఒక సినిమా చూసాను. చింత కింది మల్లేశం అని. అందులో హీరోకి వాళ్ళమ్మ చెపుతుంది. ఏ పనైనా చిన్న, చిన్నగా చేసుకుని చేస్తే, కష్టంగా అనిపించదు. ఒక్కొక్కటిగా పూర్తి చేయడం వీలవుతుంది అని. ఎంత చక్కటి పాఠం అది. అలాంటి పాఠాలు చెప్పే అమ్ముంటే, మీకు ఆసక్తి ఉన్న ఏ పనైనా సరే చేయడం కష్టం అనిపించదు. ఆ మాటలు వింటుంటే నాకు గుర్తొచ్చిన మరో విషయం బ్రిటిష్ వారి “విభజించి పాలించ...

కిటికీ పక్కన సీటు…?

ఈ బిజీ ప్రపంచంలో ప్రతీ ఒక్కరి జీవితంలో ప్రయాణం ఒక భాగమైపోయింది. కొద్ది సేపు ప్రయాణించే బస్సు, కారులలో వెళ్లే, దగ్గరి ప్రయాణాలనుండి, కొన్ని రోజులు ప్రయాణించే రైలు ప్రయాణం వరకు, దాదాపు అందరూ కిటికీ పక్కన కూర్చునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొంత మంది గాలి రావడం కోసం కిటికీ పక్కన కూర్చుంటే, మరి కొంత మంది బయట ప్రపంచాన్ని దగ్గరగా చూడవచ్చని కూర్చుంటారు. వాస్తవంగానే, సాధారణంగా గమనించినప్పటికంటే కూడా ప్రయాణంలో ప్రపంచం బాగా దగ్గరగా చూస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకనే విశాలంగా వున్నట్లు వుండేలా కిటికీలు తెరిచి ఉంచుకునే వరకు ఆ గాలి చల్లగా స్పర్శించే వరకు మనసుకు హాయిగా అనిపించదు. కొద్దిసేపు చేసే జర్నీలోనే ఇంత ఆనందాన్ని వెతుక్కుంటూ, చిన్న ప్రయాణంలో కిటికీలు తెరిచి ఉంచుకునే మనమే మన మనసు తలుపులు మాత్రం ఎప్పుడూ మూసుకునే వుంటాం. ఈ పోటీ ప్రపంచంలో, ఉరుకులు పరుగుల గమనంలో మనం ఇంకొకరి జీవితాల్లోకి చూడం. మన జీవితంలోకి చూసే అవకాశం కూడా ఇంకెవరికీ లేకుండా ఇంటి తలుపులతో పాటే మనసు తలుపులు కూడా మూసేస్తాం. కాని ఒక్కసారి మూసేసిన మీ మనసు తలుపులు తీసి చూస్తే తెలుస్తుంది అసలైన ప్రపంచం ఏంటో. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది, ...

నూరుశాతం(100%) కోసం వెతుకులాటా…?

స్నేహంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు లేక భాగస్వామిలో కావచ్చు… ఎవరిలో అయినా సరే 100% కోసం ఎప్పుడూ వెతక్కండి. ఎప్పుడైతే ఎదుటివారు నూరు శాతం పక్కాగా ఉండాలనుకుంటామో అప్పుడే సమస్యలు మొదలవుతాయి. అది ఆ బంధాన్ని శాశ్వతంగా దూరం చేసుకోవడం వరకు కూడా వెళ్లొచ్చు. అందుకే ఎవరిలోనైనా సరే నూరు శాతం కోసం వెతకొద్దు, ఎందుకంటే మనుషులందరిలో కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. బలాల్ని గుర్తించి ప్రోత్సహించడం, బలహీనతలని దిద్దుకునేలా సహకరించడం చేయాలి. పొరపాట్లు చేస్తే క్షమించడం ప్రతీ బంధంలో వుండాల్సిన ముఖ్య లక్షణం. అలా చేయగలిగినప్పుడే ఏ బంధమైనా శాశ్వతంగా వుంటుంది. వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచంలో నూటికి నూరు శాతం పక్కాగా ఎవరూ వుండరు. మనుషులంతా అంతే, నేను ఎలా వున్నా సరే, ఎదుటివారు మాత్రం ఇలానే వుండాలి, అలానే ఉండాలి అనుకుంటాం. ఎవరికి వారు వాళ్ళు చేసేవి చాలా సరైనవిగా కనిపిస్తాయి కానీ ఎదుటివారు చేసేవి మాత్రం చిన్న పొరపాట్లని కూడా పెద్ద తప్పుగా భావించి నిందిస్తాం. తప్పులు చేయడం మానవ సహజం.ప్రతి ఒక్కరూ చిన్నవో, పెద్దవో తప్పులు చేస్తూనే వుంటారు. వాటి నుంచి నేర్చుకుంటూ మరోసారి చేయకుండా జగ్రత్తపడతారు. కొంతమంది చేసిన తప్పునే మళ్లీ...

ఏ లక్ష్యం లేకపోతే..?

ఆనందంగా ఉన్న వ్యక్తికి లక్ష్యం లేకపోవడం అసలు తప్పే కాదు. లక్ష్యం లేకపోవడం తప్పు అనే ఆలోచన ఒక తప్పు. కానీ లక్ష్యం అనేది నీ గమనాన్ని నిర్దేశిస్తుంది. నీ ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. నువ్వు నడవాల్సిన దారి ఏదో చూపిస్తుంది. ప్రవహించే నది ఎలా సముద్రాన్ని చేరుతుందో.. నీ లక్ష్యాన్ని చేరే క్రమంలో నువ్వు కూడా నిరంతరం ప్రయాణిస్తూ, ఎదుగుతూ వుంటావు. ప్రయాణించే నదిలానే స్వచ్ఛంగా వుంటావు. ఏ లక్ష్యం లేనప్పుడు నిలకడగా వున్న నీటిలాగ తయారవుతావు. అందులో ఎలాంటి కొత్తదనం వుండదు. నువ్వు ఎంచుకున్న రంగం ఏదైనా కావచ్చు. ఎప్పుడైతే నీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటావో, అప్పుడే నీలో ఎదుగుదల అనేది మొదలవుతుంది. లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు, నిన్న ఎక్కడ ఉన్నావో, ఎలా ఉన్నావో ఇవాళ కూడా అక్కడే అలాగే ఉండిపోతావు. రేపు కూడా అలాగే వుంటావు. నిన్న, నేడు, రేపు కూడా అలాగే వున్నట్లయితే నీకు, నిర్జీవి కి తేడా ఏం లేనట్టే కదా! “కొంతమంది 60 ఏళ్ల తర్వాత చనిపోతే ఏ లక్ష్యం లేనివాళ్ళు 25 ఏళ్ళకి ముందే చనిపోతారు”. అందుకే మీ సామర్ధ్యం వున్నంత వరకు లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. దాన్ని సాధించుకునే వరకు కృషి చేయండి మీ జీవితం అద్భుతంగ...

నిర్ణయం తీసుకునే ముందే ఎందుకు అవగాహన పెంచుకోవాలి?

మనలో చాలా మందికి త్వరత్వరగా, అప్పటికప్పుడు ఏదనిపిస్తే దానివైపే మొగ్గి, తొందరపాటులో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం, తర్వాత సరైన నిర్ణయం తీసుకోలేదని పశ్చాత్తాపం చెందడం అలవాటే. నీవు తీసుకునే నిర్ణయాన్ని బట్టే నువ్వు రేపటి రోజున ఎక్కడ ఉంటావో నిర్ణయించబడుతుంది. కొంత ఆలస్యమైనా సరే దాని యొక్క ప్రాధాన్యతను బట్టి తగిన సమయం తీసుకుని ఆలోచించిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోవడం అన్ని విధాలా ఉత్తమం. ప్రతిసారీ అన్ని అనుకున్నట్లుగానే జరగాలనేం లేదు, కానీ ఎలాంటి అవగాహన లేకుండా చేసే పనులు తప్పు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిర్ణయం తీసుకునే క్రమంలో వివిధ దశలు.. 1. విషయం పైన పరిజ్ఞానం పెంచుకోవడం 2. దాని ఫలితాన్ని ఊహించడం 3. సానుకూలతలు, ప్రతికూలతలు పరిశీలించడం 4. ఆలోచన ఫెయిల్ అయితే దాని ప్రభావాన్ని అంచనా వేసుకోవడం 5. చివరగా నష్ట ప్రభావం తక్కువగా ఉండి, సానుకూలతలు ఎక్కువగా వున్న దాన్ని ఎంచుకోవడం.