కిటికీ పక్కన సీటు…?
ఈ బిజీ ప్రపంచంలో ప్రతీ ఒక్కరి జీవితంలో ప్రయాణం ఒక భాగమైపోయింది. కొద్ది సేపు ప్రయాణించే బస్సు, కారులలో వెళ్లే, దగ్గరి ప్రయాణాలనుండి, కొన్ని రోజులు ప్రయాణించే రైలు ప్రయాణం వరకు, దాదాపు అందరూ కిటికీ పక్కన కూర్చునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొంత మంది గాలి రావడం కోసం కిటికీ పక్కన కూర్చుంటే, మరి కొంత మంది బయట ప్రపంచాన్ని దగ్గరగా చూడవచ్చని కూర్చుంటారు. వాస్తవంగానే, సాధారణంగా గమనించినప్పటికంటే కూడా ప్రయాణంలో ప్రపంచం బాగా దగ్గరగా చూస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకనే విశాలంగా వున్నట్లు వుండేలా కిటికీలు తెరిచి ఉంచుకునే వరకు ఆ గాలి చల్లగా స్పర్శించే వరకు మనసుకు హాయిగా అనిపించదు. కొద్దిసేపు చేసే జర్నీలోనే ఇంత ఆనందాన్ని వెతుక్కుంటూ, చిన్న ప్రయాణంలో కిటికీలు తెరిచి ఉంచుకునే మనమే మన మనసు తలుపులు మాత్రం ఎప్పుడూ మూసుకునే వుంటాం. ఈ పోటీ ప్రపంచంలో, ఉరుకులు పరుగుల గమనంలో మనం ఇంకొకరి జీవితాల్లోకి చూడం. మన జీవితంలోకి చూసే అవకాశం కూడా ఇంకెవరికీ లేకుండా ఇంటి తలుపులతో పాటే మనసు తలుపులు కూడా మూసేస్తాం.
కాని ఒక్కసారి మూసేసిన మీ మనసు తలుపులు తీసి చూస్తే తెలుస్తుంది అసలైన ప్రపంచం ఏంటో. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది, ఎదుటివారికి కూడా సంతోెషాన్ని పంచుతుంది. అందుకే మీ కిటికీ తలుపులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే తెరవండి. ఇంటి తలపులతో పాటు, మనసు తలుపులు కూడా…..
RV Writings...
Comments
Post a Comment