అంతా మనమంచికే....(తప్పక చదివి తీరాల్సిన ఒక మంచి కథ)

సుఖదుఃఖాలు, సంతోషం బాధ అనేవి జీవితంలో ఒక భాగం మాత్రమే అంతే కాని చిన్న కష్టం రాగానే దాన్నే పట్టుకుని బాధ పడుతూ కూర్చుంటే నువ్వు చేయవలసిన పనులు అలాగే మిగిలిపోతాయి. అది మంచి చేయకపోగా నిన్ను వెనక్కి లాగుతూ వుంటాయి. అందుకే ఏది జరిగినా కూడా మంచికే జరిగిందనుకొని ముందుకెళ్లడం వుత్తమం అని చెప్పే ఒక కథ చెప్పుకుందాం.

అనగనగా ఒక రాజు వుండే వాడు, ఆ రాజు దగ్గర చాలా తెలివైన ఒక మంత్రి వుండేవాడు. అయితే తన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే ఎవరు తమ సమస్యల్ని చెప్పుకోవడానికి వచ్చినా కూడా అయిందేదో అయింది అదంతా మంచికే జరిగింది అనుకుని ముందుకు సాగాలి అని చెప్తూ వుండే వాడు, కొంతమంది మంత్రి మాటలు సహజంగానే తీసుకున్నప్పటికీ చాలా మందికి అది నచ్చేది కాదు. అలాగే ఒకరోజు రాజ్యం లోని ఒక వ్యక్తి భార్య చనిపోయిందని మంత్రికి చెప్తూ బాధపడుతుంటే, మంత్రి దీనికి కూడా అయిందేదో నీ మంచికే అయింది బాధపడకుండా, నీ పనుల్లో నిమగ్నమై పోయి ముందుకు సాగాలి అని చెప్తుపొతున్నాడు, అది సహించలేని ఆ వ్యక్తి మంత్రిపై కోపంతో తిరిగి వెళ్ళిపోతాడు. అది చూసిన రాజు గారికి కూడా మంత్రిపై కోపం కలుగుతుంది. కొన్నాళ్ళు పోయాక మంత్రి గారి భార్య కూడా చనిపోయింది అప్పుడు కూడా మంత్రి కొంత బాధపడ్డా క తేరుకుని జరిగిందేదో మంచికే జరిగింది అనుకుని తన పనుల్లో తాను నిమగ్నమైపోయాడు. ఇదంతా చూస్తున్న ప్రజలకు, రాజు గారికి కూడా మంత్రిపై సందేహం కలుగుతుంటుంది. ఇదిలా వుండగా రాజు గారు ఎప్పట్లానే మంత్రి, సైనికులతో కలిసి వేటకి బయల్దేరాడు. వేటలో ప్రావీణ్యం ఉన్న రాజు గారు వేట ముగించుకుని తిరిగి వెళ్తుంటే కాలి చిటికన వేలు కి పెద్ద గాయం తగిలి దాన్ని పూర్తిగా తీసెయ్యా ల్సి వస్తుంది. అప్పుడు కూడా రాజు గారికి ఓదార్పు గా, నీ కాలికి గాయం కూడా మంచికే జరిగింది అంటాడు. నా కాలికి గాయమైతే మంచికే అయిందంటావా అని ఆగ్రహించిన రాజు గారు ఇక మంత్రిని ఉపేక్షింబోమని వెంటనే సైనికుల్ని పిలిపించి మంత్రిని జైల్లో పెట్టిస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్లీ మంత్రి గారు లేకుండా వేటకి వెళ్ళిన రాజు గారు వేటలో మునిగి పోయి సైనికుల నుంచి తప్పిపోతాడు. సైనికులు ఎంత సేపటికీ కనిపించని రాజు దారి తప్పి అడవి లోపలికి వెళ్లిపోయి కోయ వాళ్ళకి చిక్కుతాడు. కోయ వాళ్ళు ఆ రాజు గారిని వాళ్ళ పెద్ద కి అప్పగించగా, కోయ దేవుడికి బలి ఇచ్చేందుకు రాజు గారిని తయారు చేయాల్సిందిగా నిర్ణయించుకుని, ఒక పవిత్రమైన దినాన రాజు గారిని బలి చ్చేందుకు సిద్దం చేస్తుండగా రాజు గారికి కాలి చిటికన వేలు లేకపోవడం గమనించి బలికి పనికి రాడని వదిలేస్తారు.. ప్రాణాలతో బటపడిన రాజు హుటాహుటిన మంత్రి దగ్గరికెళ్ళి క్షమించండి మంత్రి గారి మిమ్మల్ని జైల్లో ఉంచి తప్పు చేశాను. మీరు చెప్పినట్లే నా కాలి గాయమే నాకు మంచి చేసింది. ఒకవేళ ఆ వేలు పొకపోయి వుండి వుంటే ఈ రోజు నా ప్రాణాలే నాకు దక్కేవి కావు. ఏం జరిగినా మన మంచికే అన్న విషయానికి అర్థం నాకు ఇప్పుడు తెలిసింది. మీరు నన్ను క్షమంచండి అని అడగ్గా, మంత్రి గారు, అయ్యో రాజు గారు మీరు నన్ను జైల్లో పెట్టినందుకు నాకు ఏమాత్రం మీ పైన కోపం గాని, బాధ గాని లేవండి ఇంకా చెప్పాలంటే నన్ను జైల్లో పెట్టడం కూడా మంచిదే అయింది అంటాడు. అది విన్న రాజుకి మళ్లీ ఇదేం టయ్య మంత్రి జైల్లో పెట్టడం మంచి విషయం ఎలా అయ్యిందో సెలవి వ్వండి అనగా, మంత్రి అప్పుడు రాజుతో, ఒకవేళ నన్ను జైల్లో పెట్టకపోయి వుంటే నేను కూడా మీతో వచ్చివుండే వాడిని, మీరు వేటలో దారి తప్పి పోతే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నేను కూడా కోయ వాళ్ళకి దొరికే వాన్ని. మీకు వేలు లేదు కాబట్టి మిమ్మల్ని వదిలేసి అన్ని శరీర భాగాలు సక్రమంగా వున్న నన్ను బలి తీసుకునే వారు. అందుకే నన్ను జైల్లో పెట్టడం వల్ల, నేను మీతో రాకుండా చేసి మంచిదే అయింది అంటూ, అలాగే జరిగి పోయిన విషయాల గురించి ఇలా జరిగింది అలా జరిగింది అని బాధ పడక, అంతా మన మంచికే జరిగింది అనుకుని మన ముందున్న కర్తవ్యాన్ని నిర్వర్తించడం తెలివి కల వాడి లక్షణం అని రాజు కి సలహా ఇచ్చాడు.

Comments

Popular posts from this blog

ఉన్నది ఒకటే జిందగి...

సమయాన్ని వృధా చేయకండి...