ఏ లక్ష్యం లేకపోతే..?
ఆనందంగా ఉన్న వ్యక్తికి లక్ష్యం లేకపోవడం అసలు తప్పే కాదు. లక్ష్యం లేకపోవడం తప్పు అనే ఆలోచన ఒక తప్పు.
కానీ లక్ష్యం అనేది నీ గమనాన్ని నిర్దేశిస్తుంది. నీ ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. నువ్వు నడవాల్సిన దారి ఏదో చూపిస్తుంది. ప్రవహించే నది ఎలా సముద్రాన్ని చేరుతుందో.. నీ లక్ష్యాన్ని చేరే క్రమంలో నువ్వు కూడా నిరంతరం ప్రయాణిస్తూ, ఎదుగుతూ వుంటావు. ప్రయాణించే నదిలానే స్వచ్ఛంగా వుంటావు. ఏ లక్ష్యం లేనప్పుడు నిలకడగా వున్న నీటిలాగ తయారవుతావు. అందులో ఎలాంటి కొత్తదనం వుండదు.
నువ్వు ఎంచుకున్న రంగం ఏదైనా కావచ్చు. ఎప్పుడైతే నీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటావో, అప్పుడే నీలో ఎదుగుదల అనేది మొదలవుతుంది. లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు, నిన్న ఎక్కడ ఉన్నావో, ఎలా ఉన్నావో ఇవాళ కూడా అక్కడే అలాగే ఉండిపోతావు. రేపు కూడా అలాగే వుంటావు. నిన్న, నేడు, రేపు కూడా అలాగే వున్నట్లయితే నీకు, నిర్జీవి కి తేడా ఏం లేనట్టే కదా!
“కొంతమంది 60 ఏళ్ల తర్వాత చనిపోతే ఏ లక్ష్యం లేనివాళ్ళు 25 ఏళ్ళకి ముందే చనిపోతారు”.
అందుకే మీ సామర్ధ్యం వున్నంత వరకు లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. దాన్ని సాధించుకునే వరకు కృషి చేయండి మీ జీవితం అద్భుతంగా అనిపిస్తుంది.
Comments
Post a Comment