మంచిని చాటింపు చేద్దాం
అవును మంచిని తప్పకుండ చాటింపు చెయ్యాలి. ఈ మధ్యనే ఒక వీడియో లో ఒక కథ విన్నాను. అంతకు ముందు వరకు కూడా నాకు ఒక అభిప్రాయం ఉండేది. మంచి వాడు ఎప్పుడు కూడా నేను మంచివాణ్ణి అని చెప్పుకోడు అని. నిజమే మంచి వాడు అని చెప్పుకోకపోయిన పరవాలేదు కానీ కనీసం తాను చేసే మంచిగాని, తాను పాటించే మంచి గాని ఇతరులకు తెలియాలి. కచ్చితంగా తెలియాలి. అలా తెలియాలి అంటే కొన్ని సార్లు చెప్పుకోవాల్సి వస్తుంది.
ఇంతకీ ఆ వీడియో లో ఏం ఉందంటే చెడ్డవాడేమో దైర్యంగా తాను చెడు చేస్తున్నానని బహిరంగంగా చెప్పుకుంటున్నాడు, అంతే గాక అదేదో పెద్ద ఘనకార్యం లాగా అయిపొయింది. మంచివాడేమో తాను చేసేదేదో తప్పు అన్నట్లు గా వెనకే ఉండిపోతున్నాడు. మంచివాడు కదా ధైర్యంగా చెప్పుకోవాల్సింది అని గట్టిగా నొక్కి మరీచెప్పాడు. ఆలోచిస్తే అది అక్షరాలా నిజం అని అర్థమైంది. ప్రపంచంలో ఎంతో మంచి వుంది. ప్రపంచమంతా కూడా వెతకక్కరలేదు. మన చుట్టూ సమాజం లో కూడా ఎంతో మంచి జరుగుతుంది. ఆ మంచినే మనం నిత్యం చాటుదాం. అది మనం చూసేదైనా సరే లేక చేసేదైనా సరే. అలా జరిగినప్పుడే చుట్టూ ఉన్న మంచి కూడా అందరికీ తెలిసి, సమాజం చెడిపోయింది , అసలు మంచి అన్నదే లేదు అనుకునే వారి ఆలోచనలో కొంతైనా మార్పు వస్తుంది.
Comments
Post a Comment