ఒక్కొక్కటిగా...

మనలో చాలా మందికి ఏదైనా మొదలు పెట్టిన వెంటనే విజయం సాధించాలి,సక్సెస్ వచ్చేయాలి, నెంబర్ 1  కావాలి అనే ఆశ ఉంటుంది. విజయం పొందాలి అనుకోవడం మంచిదే కానీ వెంటనే జరిగిపోవాలి అనే ఆత్రుత ఏమాత్రం మంచిది కాదు. అది మంచిని చెయ్యక పోగా మొదటికే మోసం వస్తుంది.    

అలా కాకుండా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళితే ఎంత పెద్ద లక్ష్యమైన సరే నెమ్మదిగా కరిగిపోయి, అనుకున్నది సాధించగలుగుతారు. లేదంటే వెంటనే సాధించేయాలని ఆరంభ శూరత్వంతో మొదలు పెడితే, ఆ క్షణం లో  బాగానే ఉన్నా కూడా కొంత కాలానికే మీరు చేయాల్సింది ఎంతో వున్నట్టుగా, ఇంకా ఎంతో దూరం వెళ్లాలనేలాగా, అందుకోవాల్సిన గమ్యం అందుకోలేనిదిగా కనిపిస్తుంది.

నేను కూడా ఈ బ్లాగ్ మొదలు పెట్టగానే వెంటవెంటనే తెగ రాసెయ్యాలి, వీలైనన్ని పోస్టులు పెట్టేసి ఎదో చేసెయ్యాలి అని ఆతృతగా వరుసగా కొన్ని పోస్టు లు చేశాను. కానీ అలా ఆతృతగా వెంటనే ఏదోచేసేద్దామనే ఉత్సాహం వల్ల  తర్వాత కొన్ని రోజులకే ఇదేదో  కష్టమైన పనేమో అనిపించి ఆపెయ్యాల్సి వచ్చింది. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ రాయాలి అనిపించి ఓపెన్ చేసి చూస్తే కొన్ని పోస్టులున్నాయి. అవి కూడా బాగున్నాయి, అలాగే కంటిన్యూ చేయకుండా మధ్యలో ఆపెయ్యడానికి కారణం ఆలోచిస్తే అర్థమైంది. ఒక్కసారే విజయం రావాలనుకుని ఆవేశపడి మొదటికే మోసం వచ్చి అసలు రాయడమే ఆపేసానని. కానీ రాయడం అంటే నాకిష్టం, దానిని ఏ కారణం చేత కూడా మానుకోవడం  నాకు ఇష్టం లేదు అందుకని బాగా ఆలోచించి అప్పటినుండి  ఒక్కొక్కటిగా రాయడం మొదలెట్టాను. ఇలా ఒకటి ఒకటి కలిసే పదులు, పదులు పదులు కలిసి వందలు, ఆ వందలే వేలు కూడా అవుతాయనే నమ్మకం కూడా కలిగింది. అంతే గాని ఒకేసారి అంతా వచ్చేయాలి. అన్ని రాసెయ్యాలి అనుకుంటే అక్కడే తప్పు జరిగిపోతుంది. అయితే తొందరగా చేరుకోవాలి అనే ఆతృతలో ఇలాంటి తప్పులు చెయ్యడం సహజం. కాబట్టి అలా తొందర పడకుండా నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ మీరు అనుకున్న గమ్యానికి చేరుకొండి. గమ్యమనేది  ఒక్కసారిగా వచ్చేస్తే ఇక ఒకటికి వున్నా విలువ ఏముంది. ఒకటి చాలా విలువైనది. ఒకటి  విలువ తెలుసుకుంటే నీ ప్రయాణం సులువవుతుంది.

Comments

Popular posts from this blog

ఉన్నది ఒకటే జిందగి...

సమయాన్ని వృధా చేయకండి...