Posts

ఎంత పెద్ద విజయమైనా చిన్న అడుగు తోనే మొదలవుతుంది

మనలో చాలా మంది చేసే తప్పు పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకుని వాటిని చేరుకుంటామో లేదోనని భయంతో తీరా మొదలెట్టకుండానే ఆ లక్ష్యాన్నే వదిలేస్తుంటారు. లక్ష్యం ఎంత పెద్దదైనా సరే మొదలయ్యేది ఒక్క అడుగుతోనే అనే విషయం తెలుసుకుని ముందు నీ పనిని మొదలు పెట్టి చూడు, నెమ్మదిగా నీ లక్ష్యం చిన్నదై నీ దరికి చేరుతుంది. మొదలు పెడితే సగం పని అయినట్లే అని అందుకే అన్నారు.

ఎందుకు ఓడిపోవాలి అంటే...?

పోటీ పడే ప్రతి ఒక్కరూ, పోరాడే ప్రతి వాడు, ప్రయత్నించే ఎవరైనా సరే గెలుపు కోసమే పోరాడతారు, గెలుపు కోసమే పోటీ పడతారు, గెలుపు కోసమే ప్రయత్నిస్తారు, గెలుపునే కాంక్షిస్తూ వుంటారు తప్ప ఎవరూ కూడా ఓడిపోవాలి అనుకోరు. కాని ఏ పోటీ లో నైనా గెలుపు, ఓటములు సహజమే అనే నిజాన్ని మాత్రం ఒప్పుకోక తప్పదు. గెలుపు ని ఎలాగైతే ఆస్వాదిస్తామో అలాగే ఓటమిని అంగీకరించడమే అసలైన విజేత లక్షణం. నువ్వెంతో కష్ట పడి సాధన చేయొచ్చు, నీ శాయశక్తులా ప్రయత్నించి ఉండొచ్చు అయినా కొన్ని సార్లు ఓటమి తప్పకపోవచ్చు. అలాంటప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావో అక్కడే తెలుస్తుంది నిజమైన విజేత లక్షణం. విజేత అంటే ఎప్పుడూ గెలుస్తూనే వుంటాడు అనుకోవడం చాలా పొరపాటు. ఓటముల నుండి పాఠాలు నేర్చుకుంటూ, మళ్లీ అవే తప్పుల్ని చేయకుండా ముందుకెళ్లి, ఓటములకన్నా గెలుపుల సంఖ్యని పెంచుకునే వాడే విజేత.

కాంపిటీటివ్ సక్సెస్ మంత్ర...

1. సిలబస్ పూర్తిగా చదవడం 2. సరైన పుస్తకాల సేకరణ 3. ప్రీవియస్ పరీక్షల పేపర్ ల సాధన 4. సిలబస్ లో వున్న ప్రతీ విషయాన్ని బుక్స్ లో చదవడం 5. నమూనా పరీక్షలు రాస్తూ వుండడం 6. నోట్స్ తయారు చేసుకోవడం 7. రివిజన్ చేయడం, మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయడం 8.పైన చెప్పిన నియమాల్లో ఒక్కటి కూడా మిస్ చేయకపోవడం

అంతా మనమంచికే....(తప్పక చదివి తీరాల్సిన ఒక మంచి కథ)

సుఖదుఃఖాలు, సంతోషం బాధ అనేవి జీవితంలో ఒక భాగం మాత్రమే అంతే కాని చిన్న కష్టం రాగానే దాన్నే పట్టుకుని బాధ పడుతూ కూర్చుంటే నువ్వు చేయవలసిన పనులు అలాగే మిగిలిపోతాయి. అది మంచి చేయకపోగా నిన్ను వెనక్కి లాగుతూ వుంటాయి. అందుకే ఏది జరిగినా కూడా మంచికే జరిగిందనుకొని ముందుకెళ్లడం వుత్తమం అని చెప్పే ఒక కథ చెప్పుకుందాం. అనగనగా ఒక రాజు వుండే వాడు, ఆ రాజు దగ్గర చాలా తెలివైన ఒక మంత్రి వుండేవాడు. అయితే తన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే ఎవరు తమ సమస్యల్ని చెప్పుకోవడానికి వచ్చినా కూడా అయిందేదో అయింది అదంతా మంచికే జరిగింది అనుకుని ముందుకు సాగాలి అని చెప్తూ వుండే వాడు, కొంతమంది మంత్రి మాటలు సహజంగానే తీసుకున్నప్పటికీ చాలా మందికి అది నచ్చేది కాదు. అలాగే ఒకరోజు రాజ్యం లోని ఒక వ్యక్తి భార్య చనిపోయిందని మంత్రికి చెప్తూ బాధపడుతుంటే, మంత్రి దీనికి కూడా అయిందేదో నీ మంచికే అయింది బాధపడకుండా, నీ పనుల్లో నిమగ్నమై పోయి ముందుకు సాగాలి అని చెప్తుపొతున్నాడు, అది సహించలేని ఆ వ్యక్తి మంత్రిపై కోపంతో తిరిగి వెళ్ళిపోతాడు. అది చూసిన రాజు గారికి కూడా మంత్రిపై కోపం కలుగుతుంది. కొన్నాళ్ళు పోయాక మంత్రి గారి భార్య కూడా చనిపోయింది అప్పుడు క...

మీ జీవితం మీ ఆలోచనల ప్రతిబింబమే...

నీ ఆలోచనల్ని మార్చుకున్నట్లైతే... నీ జీవివితాన్ని మార్చుకున్నట్లే... ఒక ఆలోచనే ఒక కొత్త విషయానికి మూలం అవ్వచ్చు. ఒక ఆలోచనే ఒక కొత్త ఆవిష్కణకు నాంది కావచ్చు.

విభజించు… సాధించు…

గమ్యం పెద్దగా కనిపించినప్పుడు వదిలేయడం కాదు చేయాల్సింది. చిన్నదిగా విభజించుకోవడం. అవును కొన్ని సార్లు నీ గమ్యాన్ని చూసి నీకే భయం వేయొచ్చు. వంద మైళ్ళు పరుగెత్తాలి అని వినగానే నీ గుండె అక్కడే ఆగిపోవచ్చు, కాని దాన్ని ఒక్కొక్క మైలు వంద సార్లు పరుగెత్తాలి అని విభజించుకో, అప్పుడు నీ ముందు ఒకే మైలు, నీవు పరుగెత్తాల్సింది ఒకే మైలు. అలా ఒక వంద సార్లు పరుగెడితే సరిపోతుంది. అలాగే ఒక 15 పుస్తకాలు చదవాలి అని వినగానే నీ వల్ల కాదు అనిపించి పక్కన పడేయొచ్చు. కాని ఒకే పుస్తకం చదువు. ఒక్కటి చదవడం కష్టంగా అనిపించదు. అది అయ్యాక ఇంకొకటి, దాని తర్వాత మరొకటి. చాలా సులభం. ఇంత మాత్రానికే ప్రతి దాన్ని పెద్దగా ఊహించుకుని, భయపడి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోకు. మొన్ననే ఒక సినిమా చూసాను. చింత కింది మల్లేశం అని. అందులో హీరోకి వాళ్ళమ్మ చెపుతుంది. ఏ పనైనా చిన్న, చిన్నగా చేసుకుని చేస్తే, కష్టంగా అనిపించదు. ఒక్కొక్కటిగా పూర్తి చేయడం వీలవుతుంది అని. ఎంత చక్కటి పాఠం అది. అలాంటి పాఠాలు చెప్పే అమ్ముంటే, మీకు ఆసక్తి ఉన్న ఏ పనైనా సరే చేయడం కష్టం అనిపించదు. ఆ మాటలు వింటుంటే నాకు గుర్తొచ్చిన మరో విషయం బ్రిటిష్ వారి “విభజించి పాలించ...

కిటికీ పక్కన సీటు…?

ఈ బిజీ ప్రపంచంలో ప్రతీ ఒక్కరి జీవితంలో ప్రయాణం ఒక భాగమైపోయింది. కొద్ది సేపు ప్రయాణించే బస్సు, కారులలో వెళ్లే, దగ్గరి ప్రయాణాలనుండి, కొన్ని రోజులు ప్రయాణించే రైలు ప్రయాణం వరకు, దాదాపు అందరూ కిటికీ పక్కన కూర్చునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొంత మంది గాలి రావడం కోసం కిటికీ పక్కన కూర్చుంటే, మరి కొంత మంది బయట ప్రపంచాన్ని దగ్గరగా చూడవచ్చని కూర్చుంటారు. వాస్తవంగానే, సాధారణంగా గమనించినప్పటికంటే కూడా ప్రయాణంలో ప్రపంచం బాగా దగ్గరగా చూస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకనే విశాలంగా వున్నట్లు వుండేలా కిటికీలు తెరిచి ఉంచుకునే వరకు ఆ గాలి చల్లగా స్పర్శించే వరకు మనసుకు హాయిగా అనిపించదు. కొద్దిసేపు చేసే జర్నీలోనే ఇంత ఆనందాన్ని వెతుక్కుంటూ, చిన్న ప్రయాణంలో కిటికీలు తెరిచి ఉంచుకునే మనమే మన మనసు తలుపులు మాత్రం ఎప్పుడూ మూసుకునే వుంటాం. ఈ పోటీ ప్రపంచంలో, ఉరుకులు పరుగుల గమనంలో మనం ఇంకొకరి జీవితాల్లోకి చూడం. మన జీవితంలోకి చూసే అవకాశం కూడా ఇంకెవరికీ లేకుండా ఇంటి తలుపులతో పాటే మనసు తలుపులు కూడా మూసేస్తాం. కాని ఒక్కసారి మూసేసిన మీ మనసు తలుపులు తీసి చూస్తే తెలుస్తుంది అసలైన ప్రపంచం ఏంటో. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది, ...